'నవంబర్ 20న ఆకాశంలో ఒక తార': విడుదల తేదీని ప్రకటించిన దుల్కర్ సల్మాన్ చిత్ర బృందం
రిపోర్టర్: శివ
స్థలం: హైదరాబాద్
యువ కథానాయకుడు దుల్కర్ సల్మాన్ నటిస్తున్న తాజా చిత్రం 'ఆకాశంలో ఒక తార' విడుదల తేదీని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. పవన్ సాధినేని దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా నవంబర్ 20, 2026న విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. ఈ చిత్రంలో సాత్విక వీరవల్లి హీరోయిన్గా నటిస్తుండగా, శృతిహాసన్ కీలక పాత్ర పోషిస్తున్నారు. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను తెలుగుతో పాటు పలు భాషల్లో భారీ ఎత్తున విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.