విశాఖలో రోడ్డు ప్రమాద బాధితులకు రెండు లక్షల రూపాయల పరిహారం జమ

రిపోర్టర్: ప్రవీణ్ స్థలం: విశాఖపట్నం

విశాఖపట్నం సిటీ పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన రోడ్డు ప్రమాద బాధితుల సహాయక కేంద్రం ద్వారా హిట్ అండ్ రన్ ప్రమాదాల్లో తీవ్రంగా గాయపడిన నలుగురు వ్యక్తులకు ఒక్కొక్కరికి యాభై వేల రూపాయల చొప్పున మొత్తం రెండు లక్షల రూపాయలను వారి బ్యాంకు ఖాతాల్లోకి జమ చేసినట్లు విశాఖసిటీపోలీస్ వెల్లడించారు. ఇప్పటివరకు మొత్తం రెండు వందల పన్నెండు మంది బాధితులకు కోటీ యాభై నాలుగు లక్షల రూపాయల పరిహారం ఇప్పించినట్లు అధికారులు పేర్కొన్నారు.