అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను గడువులోగా పూర్తి చేయాలని కలెక్టర్ దివాకర టిఎస్ ఆదేశాలు
రిపోర్టర్: అశోక్
స్థలం: Khammam
ప్రభుత్వం నిర్దేశించిన అభివృద్ధి మరియు సంక్షేమ కార్యక్రమాలను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని అధికారులను జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు శుక్రవారం అన్ని జిల్లాల కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో ఖమ్మం కలెక్టరేట్ నుంచి ఆయన పాల్గొని ఈ కీలక సూచనలు చేశారు. క్షేత్రస్థాయిలో పనులను వేగవంతం చేసి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు.