వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి రైతులకు అచ్చెన్నాయుడు భరోసా
రిపోర్టర్: నరేష్
స్థలం: శ్రీకాకుళం
రాష్ట్రవ్యాప్తంగా కురిసిన వర్షాలు మరియు నదుల్లో వరద కారణంగా పంట నష్టపోయిన ప్రతి రైతునూ ప్రభుత్వం ఆదుకుంటుందని వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. శ్రీకాకుళం జిల్లాలోని నాగావళి ముంపు ప్రాంతాల్లో ఆయన శుక్రవారం పర్యటించారు. నష్టపోయిన రైతులకు తక్షణమే పరిహారం అందించేలా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. పంట నష్టంపై సమగ్ర సర్వే చేపట్టి, నీట మునిగిన వరి పంటను రక్షించేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేస్తున్నామని స్పష్టం చేశారు.