చెన్నైలో టీవీకే కార్యకర్త దారుణ హత్య, ఐదుగురు అరెస్ట్

రిపోర్టర్: శివ స్థలం: తమిళనాడు

చెన్నైలోని బసంతనగర్‌లో టీవీకే పార్టీ కార్యకర్త కణ్ణన్ దారుణ హత్యకు గురయ్యారు. శనివారం రాత్రి దుండగులు ఆయన్ను వెంబడించి నరుకు చంపారు. ఈ ఘటనపై విపక్షాలు తీవ్రస్థాయిలో మండిపడ్డాయి. రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా దిగజారాయని ఆరోపించాయి. ఈ హత్య కేసులో పోలీసులు ఇప్పటివరకు ఐదుగురిని అరెస్ట్ చేశారు. పాతకక్షల కారణంగానే ఈ హత్య జరిగినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.