బీఎస్పీ జాతీయ కోఆర్డినేటర్ గా ఇషాన్ ఆనంద్ నియామకం
రిపోర్టర్: అశోక్
స్థలం: Lucknow
బహుజ సమాజ్ పార్టీలో కీలక పరిణామం చోటుచేసుకుంది. లక్నోలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మాయావతి అధ్యక్షత జరిగిన జాతీయ కార్యవర్గ సమావేశంలో ఆమె మేనల్లుడు ఇషాన్ ఆనంద్ ను పార్టీ కొత్త జాతీయ కోఆర్డినేటర్ గా నియమించారు. తన సోదరుడు ఆకాశ్ ఆనంద్ స్థానంలో ఇషాన్ ఆనంద్ కు ఈ బాధ్యతలు అప్పగించారు. ఈ సమావేశానికి ఆనంద్ కుమార్, ఇషాన్ ఆనంద్ హాజరు కాగా, ఆకాశ్ ఆనంద్ గైర్హాజరయ్యారు.