స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై కలెక్టర్, ఎస్పీ సమీక్ష

రిపోర్టర్: RAVI BABU స్థలం: వెదురుకుప్పం

రానున్న స్థానిక సంస్థల ఎన్నికలను ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు అధికారులు సమన్వయంతో పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, ఎస్పీ తుషార్ డూడి ఆదేశించారు. చిత్తూరు కలెక్టరేట్లో నిర్వహించిన ఈ సమీక్షలో ఓటర్ల జాబితా, పోలింగ్ కేంద్రాలు, భద్రతా ఏర్పాట్లపై చర్చించారు. ఎన్నికల విధుల్లో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా అధికారులు బాధ్యతాయుతంగా పనిచేయాలని స్పష్టం చేశారు.