రేణిగుంట అంగన్వాడీ కేంద్రంలో ఘనంగా పోషకాహార వారోత్సవాలు

రిపోర్టర్: K.Shekhar స్థలం: రాజాపేట

రాజాపేట మండలంలోని రేణికుంట అంగన్వాడీ కేంద్రం 2 లో పోషణ మాసంలో భాగంగా గురువారం పోషకాహార వారోత్సవాలు జరిగాయి. అంగన్వాడీ టీచర్లు దేవిక జ్యోతి అధ్యక్షతన గ్రామంలో పోషకాహారంపై ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఏర్పాటుచేసిన తల్లుల సమావేశంలో ఐసీడీఎస్ సూపర్వైజర్ రమణ మాట్లాడుతూ పోషకాహార ప్రాముఖ్యతను వివరించారు. పిల్లల ఆరోగ్యాన్ని కాపాడాలని వార్డు మెంబర్ సత్య కళ కోరారు.