సైఫాబాద్ పోలీస్ స్టేషన్లో కేటీఆర్ పీఏ, పీఆర్వోపై దాడి దుర్మార్గం
రిపోర్టర్: అశోక్
స్థలం: హైదరాబాద్
సైఫాబాద్ పోలీస్ స్టేషన్లో తన పీఏ మహేందర్ రెడ్డి, పీఆర్వో మహేష్‌లపై దుండగులు మూకుమ్మడిగా దాడి చేయడం అత్యంత దుర్మార్గమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి పాలనలో రౌడీల రాజ్యం నడుస్తోందని ఆరోపించారు. ఖాకీల సమక్షంలో జరిగిన ఈ ఘటనపై సిట్టింగ్ జడ్జితో సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. అయితే పీఎస్ನಲ್ಲಿ ఎలాంటి దాడి జరగలేదని ఖైరతాబాద్ జోన్ డీసీపీ శిల్పవల్లి స్పష్టం చేశారు.