కొండగడపలో గణపతి వేడుకల్లో భాగంగా మహిళలకు చీరల పంపిణీ

రిపోర్టర్: Madhu Bngr స్థలం: మోత్కూరు

మోత్కూరు మున్సిపాలిటీ 4వ వార్డు కొండగడపలో గణ యూత్ ఆధ్వర్యంలో వినాయక చవితి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా వినాయక శోభాయాత్ర కోసం 20 మంది మహిళలకు చీరలను పంపిణీ చేశారు. ఈ సేవా కార్యక్రమానికి సహకరించిన వస్తాకొండూరు గ్రామానికి చెందిన చిక్కంటి అశ్విని సాయి దంపతులకు గణ యూత్ సభ్యులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. స్థానికంగా ఈ సేవా కార్యక్రమంపై ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.