విశాఖలో పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు: వైద్య శిబిరం నిర్వహణ
రిపోర్టర్: కృష్ణ
స్థలం: విశాఖపట్నం
పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాలలో భాగంగా విశాఖ నగరంలో రక్తదాన శిబిరం మరియు వైద్య శిబిరం నిర్వహించినట్లు VizagCityPolice వెల్లడించారు. నగర పోలీసు కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సిబ్బందికి, వారి కుటుంబ సభ్యులకు వైద్య పరీక్షలు చేశారు. ఆరోగ్యవంతమైన జీవన విధానంపై అవగాహన కల్పించడంతో పాటు, ఒత్తిడిని అధిగమించడానికి యోగ మరియు మెడిటేషన్ చేయాలని వైద్యాధికారులు సూచించినట్లు అధికారులు స్పష్టం చేశారు.