వీరనారి చాకలి ఐలమ్మ ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని పిలుపు
రిపోర్టర్: amudala Venkanna
స్థలం: ఖమ్మం అర్బన్
ఖమ్మం నగర బీఆర్ఎస్ ఆధ్వర్యంలో పాత ధర్నా చౌక్ వద్ద వీరనారి చాకలి ఐలమ్మ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె విగ్రహానికి పూలమాలలు వేసి నాయకులు ఘనంగా నివాళులు అర్పించారు. హక్కులు, ఆత్మగౌరవం కోసం ఐలమ్మ చేసిన పోరాటం చిరస్మరణీయమని మాజీ నగర అధ్యక్షుడు పగడాల నాగరాజు, మాజీ ఫ్లోర్ లీడర్ కర్నాటి కృష్ణ పేర్కొన్నారు. ఆమె ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆచరించాలని కోరారు.