ఈసీ జ్ఞానేష్ కుమార్ నిర్ణయంపై రాహుల్ గాంధీ ధ్వజం: రాజ్ ఘాట్ వద్ద నిరసన

రిపోర్టర్: సునీల్ స్థలం: New Delhi

ముఖ్య ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ ఏకపక్ష నిర్ణయాలకు వ్యతిరేకంగా లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, రాజ్యసభ ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే ఆధ్వర్యంలో ఇండియా కూటమి ఎంపీలు రాజ్ ఘాట్లోని గాంధీ స్మారక్ వద్ద తీవ్ర నిరసన చేపట్టారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణలో అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ కొనసాగుతున్న ఈ ఆందోళన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ప్రధాన ఎన్నికల కమిషనర్ భద్రతను జెడ్ ప్లస్ స్థాయికి పెంచినట్లు అధికారులు తెలిపారు.