డీఎస్సీ అక్రమాల ఆరోపణలపై తెదేపా ఎంపీ శివనాథ్ సవాల్
రిపోర్టర్: భాస్కర్
స్థలం: ఎన్టీఆర్ జిల్లా
డీఎస్సీ నియామకాల్లో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తున్న వైకాపా నేతలు ఆధారాలు బయటపెట్టాలని తెదేపా ఎంపీ కేశినేని శివనాథ్ సవాల్ విసిరారు. విజయవాడలోని ఎన్టీఆర్ భవన్‌లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. గంపలగూడెం మండలం ఆర్లపాడుకు చెందిన వేముల రామకృష్ణ డీఎస్సీలో ఉద్యోగం సాధించారంటూ వైకాపా అనుకూల మీడియాలో తప్పుడు కథనాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. రామకృష్ణ ప్రస్తుతం ప్రైవేట్ పాఠశాలలోనే పనిచేస్తున్నట్లు స్పష్టం చేశారు.