కాణిపాకం వినాయక స్వామిని దర్శించుకున్న పి షణ్ముగం
రిపోర్టర్: సిటిజెన్ పోస్ట్
స్థలం: ఐరాల
ఐరాల మండలంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారిని పి. షణ్ముగం తన జన్మదిన సందర్భంగా కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన స్వామివారికి భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించి, మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం వేద పండితులు ఆయనకు వేదాశీర్వచనం అందించి, తీర్థప్రసాదాలు అందజేశారు. ఆలయ సిబ్బంది కూడా ఆయనకు ఘనంగా స్వాగతం పలికి ప్రసాదాలు అందజేశారు.