ప్రదేశ్ లోని ఆజమ్‌గఢ్‌లో పూజ వివాదం నలుగురి మృతికి కారణమైన ఎన్‌కౌంటర్

రిపోర్టర్: సురేష్ స్థలం: ఉత్తరప్రదేశ్

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఆజమ్‌గఢ్ జిల్లా శంభుపూర్ ఘాజీ గ్రామంలో పూజ వివాదం కారణంగా తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఇంట్లో పూజ నిర్వహిస్తున్న అంశంపై భార్య బబితా సింగ్‌తో పాటు పురోహితులతో గొడవపడిన అరవింద్ సింగ్, లైసెన్స్‌డ్ రివాల్వర్‌తో విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో భార్యతో పాటు ఇద్దరు పురోహితులు అక్కడికక్కడే మృతి చెందారు. అనంతరం పిల్లలను గదిలో బంధించి పోలీసులపైకి కాల్పులకు తెగబడిన నిందితుడు అరవింద్ సింగ్, పోలీసుల ఎదురుకాల్పుల్లో హతమయ్యాడు.