చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్‌గా సంజూ శాంసన్‌ను నియమించాలని డిమాండ్
రిపోర్టర్: సునీల్
స్థలం: India
ఐపీఎల్‌లో వరుస వైఫల్యాలతో సతమతమవుతున్న చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు కొత్త కెప్టెన్‌గా సంజూ శాంసన్‌ను నియమించాలని మాజీ క్రికెటర్ సదాగోపన్ రమేష్ సూచించారు. రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్సీపై తీవ్ర విమర్శలు వస్తున్న నేపథ్యంలో, శాంసన్ అనుభవం జట్టుకు మేలు చేస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. గైక్వాడ్‌ను కెప్టెన్సీ నుంచి తప్పించి, కేవలం బ్యాటింగ్‌పై దృష్టి పెట్టేలా చూడాలని సుబ్రమణ్యం బద్రీనాథ్ కూడా గతంలోనే కోరారు.