ఏన్కూర్ ప్రభుత్వ ఆస్పత్రికి సిరంజీలు అందజేసిన మెడికల్ అసోసియేషన్

రిపోర్టర్: మహేష్ స్థలం: ఖమ్మం

ఖమ్మం జిల్లా ఏన్కూర్ ప్రభుత్వ ప్రాథమిక వైద్యశాలలో సిరంజీల కొరత తీవ్రంగా ఉందని తెలుసుకున్న ఏన్కూర్ మెడికల్ అసోసియేషన్ మండల కమిటీ సభ్యులు స్పందించారు. మంగళవారం మండల వైద్యాధికారి నంద్యాల బాలకృష్ణకు ఐదు వేల రూపాయల విలువైన ఇరవై బాక్సుల రెండు ఎంఎల్ సిరంజీలను అందజేశారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ మండల అధ్యక్షులు గుడ్ల వెంకటేశ్వరరావుతో పాటు పలువురు వైద్య సిబ్బంది, నాయకులు పాల్గొన్నారు.