'భూ సమస్యలపై విచారణ జరిపి పేదలకు పంపిణీ చేయాలి': సీపీఎం జాన్‌వెస్లీ
రిపోర్టర్: రాము
స్థలం: హైదరాబాద్
రాష్ట్రంలో 22ఏ కింద నెలకొన్న భూ సమస్యలన్నింటిపై సమగ్ర విచారణ జరిపి అర్హులైన పేదలందరికీ భూములు పంపిణీ చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ డిమాండ్ చేశారు. శాసనసభ సమావేశంలో సీఎం రేవంత్‌రెడ్డి భూ సమస్యలపై చర్చించి తగిన చర్యలు తీసుకుంటామని ప్రకటించడాన్ని స్వాగతించిన ఆయన, ప్రభుత్వ భూములు, అసైన్డ్, భూదాన్, ఫారెస్ట్, వక్ఫ్‌బోర్డ్ భూములన్నింటిపైనా వెంటనే విచారణ జరిపి పేదలకు న్యాయం చేయాలని హైదరాబాద్‌లో కోరారు.