ఓటీటీలో మారెమ్మ మూవీ సందడి: జియో హాట్ స్టార్లో స్ట్రీమింగ్
రిపోర్టర్: విజయ్
స్థలం: Hyderabad
మాస్ మహారాజ రవితేజ సోదరుని కుమారుడు మాధవ్ భూపతిరాజు హీరోగా నటించిన రూరల్ డ్రామా మారెమ్మ సినిమా ఇప్పటికే అమెజాన్ ప్రైమ్ వీడియో మరియు ఆహా ఓటీటీలలో స్ట్రీమింగ్ అవుతుండగా, తాజాగా ప్రముఖ ఓటీటీ జియో హాట్ స్టార్ వేదికగా కూడా పాన్ ఇండియా భాషల్లో అందుబాటులోకి వచ్చిందని సినీ వర్గాలు వెల్లడించాయి. మంచాల నాగరాజ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభిస్తోంది.