ధనత్రయోదశి ప్రాధాన్యత: బంగారం, వెండి ఎందుకు కొనుగోలు చేయాలో తెలిపిన జ్యోతిష్యులు
రిపోర్టర్: వెంకట్
స్థలం: హైదరాబాద్
అపమృత్యు దోషాలు తొలగిపోయి దీర్ఘాయుష్షు సిద్దించడానికి ధనత్రయోదశి రోజున బంగారం లేదా వెండి కొనుగోలు చేయాలని ప్రముఖ జ్యోతిష్యులు మాచిరాజు కిరణ్ కుమార్ వెల్లడించారు. పురాణ కాలం నాటి కథ ఆధారంగా లక్ష్మీదేవి రూపమైన బంగారం, వెండి వస్తువులను కొనుగోలు చేసే ఆచారం ప్రారంభమైందని ఆయన తెలిపారు. నవంబర్ ఆరో తేదీన వచ్చిన ఈ పర్వదినం సందర్భంగా ఆభరణాలు కొనుగోలు చేయడం వల్ల ఇంట అదృష్టం, ఐశ్వర్యం వెల్లివిరుస్తాయని ఆయన వివరించారు.