లిక్కర్ స్కామ్: చంచల్గూడ జైలుకు కిరణ్ కుమార్ రెడ్డి తరలింపు
రిపోర్టర్: విజయ్
స్థలం: హైదరాబాద్
లిక్కర్ స్కామ్ కేసులో ప్రధాన నిందితుడైన కిరణ్ కుమార్ రెడ్డిని విజయవాడ జైలు నుండి హైదరాబాద్ లోని చంచల్గూడ కేంద్ర కారాగారానికి ఈడీ అధికారులు తరలించినట్లు వర్గాలు వెల్లడించాయి. పీటీ వారెంట్ ఆధారంగా అతడిని ఇక్కడికి తీసుకువచ్చినట్లు అధికారులు తెలిపారు. తదుపరి విచారణ నిమిత్తం కస్టడీ కోరుతూ నాంపల్లి ప్రత్యేక కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా, దీనిపై న్యాయమూర్తి తీర్పును బుధవారానికి వాయిదా వేశారు.