భారీ వర్షాల నేపథ్యంలో విజయనగరం జిల్లాలో కలెక్టర్ విస్తృత పర్యటన
రిపోర్టర్: ప్రవీణ్
స్థలం: విజయనగరం
భారీ వర్షాల నేపథ్యంలో విజయనగరం జిల్లా కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి మంగళవారం బొండపల్లి, గజపతినగరం మండలాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ కార్యాలయాలను సందర్శించి తుపాను సన్నద్ధతపై రెవెన్యూ అధికారులతో సమీక్ష నిర్వహించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసి సురక్షిత ప్రాంతాలకు తరలించాలని, అధికారులు ప్రజల మధ్యే ఉంటూ సేవలందించాలని ఆయన స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.