ఎఫ్ఆర్ఆర్ఓ నోటీసులపై బాంబే హైకోర్టును ఆశ్రయించిన నటుడు ఇమ్రాన్ ఖాన్

రిపోర్టర్: శివ స్థలం: ముంబై

భారత్ వీడి వెళ్లాలంటూ విదేశీయుల ప్రాంతీయ రిజిస్ట్రేషన్ కార్యాలయం జారీ చేసిన నోటీసును సవాల్ చేస్తూ నటుడు ఇమ్రాన్ ఖాన్ బాంబే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ చర్య సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా ఉందని, తన ప్రాథమిక హక్కులను కాలరాసేలా ఉందని ఆరోపించారు. ముంబైలో జరిగిన ఓ ఆందోళనలో పాల్గొన్న తర్వాత అధికారులు ఈ నోటీసులు జారీ చేయడం పట్ల ఆయన తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ అత్యవసర విచారణ కోరారు.