జోధ్‌పూర్‌లో భారీ అగ్నిప్రమాదం పేలుళ్లలో 14 మంది ఫైర్ సిబ్బందికి గాయాలు
రిపోర్టర్: వెంకట్
స్థలం: జోధ్‌పూర్
రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో గణేశ్ నగర్ ప్రాంతంలోని ఓ హస్తకళల కర్మాగారంలో బుధవారం సాయంత్రం ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. ఫ్యాక్టరీలో నిల్వ ఉంచిన రసాయన డ్రమ్ములు పేలడంతో మంటలను ఆర్పుతున్న 14 మంది అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఎనిమిది మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యాధికారులు తెలిపారు. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. నిబంధనలకు విరుద్ధంగా నివాస ప్రాంతంలో రసాయనాలు నిల్వ చేయడంపై అధికారులు విచారణ ప్రారంభించారు.