మియాపూర్ భూముల విక్రయంపై రేవంత్ రెడ్డికి కేటీఆర్ తీవ్ర సవాల్
రిపోర్టర్: శివ
స్థలం: హైదరాబాద్
మియాపూర్ లోని ప్రభుత్వ భూముల విక్రయంపై సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ నేత కేటీఆర్ తీవ్రంగా మండిపడ్డారు. ఆ స్థలాలను పేదలకు, అమరవీరులకు కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు. హైదర్‌నగర్ లో జరిగిన పార్టీ చేరికల కార్యక్రమంలో కేటీఆర్ మాట్లాడుతూ, ప్రభుత్వ భూ దోపిడీని సహించేది లేదని హెచ్చరించారు. తాము అధికారంలోకి రాగానే ఈ భూముల వ్యవహారంపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తామని ఆయన స్పష్టం చేశారు.