రూపాయి గురుదక్షిణతో మైమ్ కళను నేర్పిస్తున్న పశ్చిమ బెంగాల్ కళాకారుడు ధీరజ్
రిపోర్టర్: రమేష్
స్థలం: West Bengal
తీవ్ర పేదరికం కారణంగా ఎనిమిదో తరగతిలోనే చదువు మానేసిన ధీరజ్, సైకిల్ రిపేరు దుకాణంలో పనిచేస్తూనే మురికివాడల పిల్లలకు రూపాయి గురుదక్షిణతో మైమ్ కళను నేర్పిస్తున్నట్లు తెలిపారు. పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఈ మైమ్ ఆర్టిస్ట్ గత ముప్పై ఏళ్లుగా ఇమోన్ మైమ్ సెంటర్ ద్వారా వందలాది మంది పేద విద్యార్థులకు ఉచితంగా శిక్షణ ఇస్తూ, కేంద్ర ప్రభుత్వంచే నాట్యగురు బిరుదును అందుకున్నారని ఆయన వెల్లడించారు.