బీసీ ఆత్మగౌరవ భవనాలపై రేవంత్ రెడ్డి సర్కార్ జీవో 14 కలకలం

రిపోర్టర్: సురేష్ స్థలం: హైదరాబాద్

బీసీ ఆత్మగౌరవ భవనాలను ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకునేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం జీవో 14 ను తీసుకువచ్చిందని కులసంఘాల నేతలు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. గతంలో కేసీఆర్ హయాంలో కేటాయించిన భూములు, ట్రస్టులను రద్దు చేసి భవనాల నిర్వహణను తమ చేతుల్లోకి తీసుకోవాలని సర్కార్ చూస్తోందని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే ఈ కుట్రను వెంటనే ఉపసంహరించుకోవాలని బీసీ సంఘాల నాయకులు డిమాండ్ చేశారు.