పోఖ్రాన్ లో స్వదేశీ కేఏఎల్ డ్రోన్ పరీక్షలు విజయవంతం

రిపోర్టర్: రమేష్ స్థలం: Pokhran

భారత రక్షణ రంగానికి సంబంధించి మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఐజీ డిఫెన్స్ సంస్థ పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన లాంగ్ రేంజ్ వన్ వే అటాక్ డ్రోన్ కేఏఎల్ పోఖ్రాన్ లో నిర్వహించిన ట్రయల్స్ లో విజయవంతంగా పరీక్షించబడింది. దేశీయ సాంకేతిక పరిజ్ఞానంతో తయారైన ఈ అధునాతన డ్రోన్ విజయవంతం కావడం రక్షణ రంగంలో ఆత్మనిర్భర్ భారత్ దిశగా మరో అడుగుగా నిలిచింది.