రాజాపేటలో ఘనంగా పండుగ సాయన్న విగ్రహ భూమిపూజ
రిపోర్టర్: K.Shekhar
స్థలం: రాజాపేట
రాజాపేట మండల కేంద్రంలో ముదిరాజుల పోరాటయోధుడు పండుగ సాయన్న విగ్రహ ప్రతిష్ఠాపనకు సంబంధించి బుధవారం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. విగ్రహం ఏర్పాటు కోసం స్థలాన్ని కేటాయించి భూమిపూజ ఘనంగా చేపట్టారు. ఈ సందర్భంగా విగ్రహ కమిటీ అధ్యక్షులుగా మేడమైని శ్రీరాములును ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు పులి చంద్రమౌళి, వివిధ గ్రామాల సర్పంచ్లు, ముదిరాజ్ సంఘం నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.