వైరల్ అవుతున్న విరాన్ష్ పెద్దగట్టు జాతర సినిమా ప్రారంభోత్సవం
రిపోర్టర్: హరి
స్థలం: హైదరాబాద్
ఆర్కే రెడ్డి ఫిల్మ్స్ ప్రొడక్షన్ నెం.1గా విరాన్ష్ హీరోగా తెరకెక్కనున్న కొత్త చిత్రం పెద్దగట్టు జాతర ఘనంగా ప్రారంభమైంది. విజయ్ కుమార్. సి.హెచ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి ఎ. రామ కృష్ణ రెడ్డి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో దర్శకుడు అనిల్ రావిపూడి క్లాప్ కొట్టగా, శివలెంక కృష్ణ ప్రసాద్ స్క్రిప్ట్ అందజేశారు. దేవి శ్రీ గురూజీ కెమెరా స్విచ్ ఆన్ చేయగా, చిత్ర యూనిట్ సభ్యులు ఈ వేడుకలో పాల్గొని చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు.