దిశా సాలియన్ తండ్రి సతీశ్ సాలియాన్ సంచలన లీగల్ నోటీసులు

రిపోర్టర్: హరి స్థలం: മുംബൈ

దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మాజీ మేనేజర్ దిశా సాలియన్ మృతి కేసు కొత్త మలుపు తిరిగింది. కుమార్తె మృతిపై న్యాయం కోసం పోరాటం చేస్తున్న తనను రాజకీయ ప్రేరేపితుడిగా చిత్రీకరించేందుకు యత్నించారంటూ శివసేన యూబీటీ నేత ఆదిత్య ఠాక్రే, ఎన్‌సీపీ ఎస్పీ నేత అనిల్ దేశ్‌ముఖ్‌కు ఆమె తండ్రి సతీశ్ సాలియాన్ రూ.500 కోట్ల లీగల్ నోటీసు జారీ చేశారు. అంతేకాకుండా మీడియా, సోషల్ మీడియా వేదికల ద్వారా మూడు నిమిషాల వీడియోతో క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.