పృథ్వీరాజ్, మంజు వారియర్ 'ఒడియన్' షూటింగ్ షురూ!

రిపోర్టర్: శివ స్థలం: Kerala

పృథ్వీరాజ్ సుకుమారన్, మంజు వారియర్ ప్రధాన పాత్రల్లో రాహుల్ సదాశివన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న హారర్ మిస్టరీ చిత్రం 'ఒడియన్: ది ఏజ్ ఆఫ్ ఇల్యూజన్' పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. 19వ శతాబ్దపు కేరళ నేపథ్యంలో జానపద, పౌరాణిక అంశాలతో ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది. పృథ్వీరాజ్ ప్రొడక్షన్స్, ధర్మ ప్రొడక్షన్స్ సంయుక్తంగా ఈ భారీ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.