అమెరికా ఏఐ చిప్స్ లీక్ వివాదం: ట్రంప్పై సంచలన కథనం కలకలం

రిపోర్టర్: సతీష్ స్థలం: Washington

అమెరికా అధునాతన ఏఐ చిప్స్ను చైనాకు చేరవేస్తున్నారనే ఆరోపణలపై సింగపూర్ కంపెనీ మెగాస్పీడ్ ఎగ్జిక్యూటివ్ ఆలిస్ హువాంగ్పై అమెరికా నిఘా పెట్టినట్లు అంతర్జాతీయ మీడియా వెల్లడించింది. ఎన్విడియా సీఈవో జెన్సన్ హువాంగ్తో ఆమెకు సన్నిహిత సంబంధాలు ఉండటం వైట్హౌస్ను ఉలిక్కిపడేలా చేసింది. అయితే ఈ ఆరోపణలను ఎన్విడియా తీవ్రంగా ఖండించగా, అమెరికా కావాలనే నిరాధారమైన బురదజల్లుతోందని వాషింగ్టన్లోని చైనా ఎంబసీ స్పష్టం చేసినట్లు ఆ కథనంలో పేర్కొన్నారు.