యెమెన్‌లో చైనా తయారీ రహస్య క్షిపణి శకలాలు గుర్తింపు!

రిపోర్టర్: కిరణ్ స్థలం: World

యెమెన్‌లోని మారిబ్ ప్రావిన్స్‌లో లభించిన శిథిలాలు చైనాకు చెందిన డిఎఫ్-15ఏ స్వల్పశ్రేణి బాలిస్టిక్ క్షిపణికి చెందినవిగా ఓపెన్ సోర్స్ విశ్లేషకులు గుర్తించారు. సౌదీ అరేబియా భూభాగం వైపు నుంచి ఈ ఆయుధం వచ్చినట్లు భావిస్తున్నారు. అయితే దీనిని ఎవరు ప్రయోగించారనే దానిపై స్పష్టత లేదు. సౌదీ, చైనా మధ్య క్షిపణి సహకారంపై ఈ పరిణామం తీవ్ర చర్చకు దారితీసింది.