అర్నబ్ తుఫాన్ హెచ్చరికలు: కొండ ప్రాంత ప్రజల తరలింపుపై ఎన్టీఆర్ పోలీసులు ప్రత్యేక చర్యలు

రిపోర్టర్: శివ స్థలం: ఎన్టీఆర్

అర్నబ్ తుఫాన్ నేపథ్యంలో కొండ ప్రాంత ప్రజల భద్రత కోసం ఎన్టీఆర్ పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారని Vijayawada City Police వెల్లడించారు. సీపీ ఎస్వీ రాజశేఖర బాబు ఆదేశాల మేరకు భవానీపురం, మాచవరం, ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ల పరిధిలోని కొండ ప్రాంత ప్రజలను అప్రమత్తం చేసి, సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నట్లు తెలిపారు. తుఫాన్ ముప్పు పొంచి ఉన్నందున ప్రజలంతా పోలీసుల సూచనలు పాటించి సురక్షితంగా ఉండాలని వారు కోరారు.