వివాహేతర సంబంధం నేపథ్యంలో వివాహిత భీకర హత్య
రిపోర్టర్: శివ
స్థలం: విజయనగరం
విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలం పెద్దనడిపల్లిలో వివాహేతర సంబంధం కలకలం రేపింది. విభేదాల కారణంగా వివాహితను హత్య చేసిన నిందితుడు బంగారుబాబు, మృతదేహాన్ని గోనె సంచిలో కట్టి సారిపల్లి సమీపంలో పడేశాడు. భర్త ఫిర్యాదుతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు, సీసీటీవీ फुటేజీ ఆధారంగా నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. వివాహేతర సంబంధమే ఈ హత్యకు కారణమని పోలీసులు తేల్చారు.