మధ్యప్రాచ్యంలో తీవ్ర ఉద్రిక్తతలు: సౌదీ ఆయిల్ ఫీల్డ్పై డ్రోన్ దాడిలో ఇద్దరు మృతి

రిపోర్టర్: శివ స్థలం: Riyadh

సౌదీ అరేబియాలోని షాయ్బా ఆయిల్ ఫీల్డ్పై జరిగిన డ్రోన్ దాడిలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారని సౌదీ ప్రెస్ ఏజెన్సీ వెల్లడించింది. ఈ దాడిలో ఒక భారతీయ జాతీయ యువకుడు కూడా గాయపడినట్లు రియాద్లోని భారత రాయబార కార్యాలయం ధృవీకరించింది. మరోవైపు ఇరాన్ సరిహద్దుల సమీపంలో ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు ప్రదర్శనగా తిరగడం మధ్యప్రాచ్యంలో తీవ్ర కలకలం రేపుతోంది.