నిరుద్యోగులకు గుడ్ న్యూస్: త్వరలో ఆర్ఆర్బీ టెక్నీషియన్ రిక్రూట్మెంట్ ప్రాథమిక కీ విడుదల
రిపోర్టర్: ప్రసాద్
స్థలం: హైదరాబాద్
రైల్వే రిక్రూట్మెంట్ బోర్డుల ఆధ్వర్యంలో ఇటీవల నిర్వహించిన టెక్నీషియన్ ఉద్యోగాల నియామక పరీక్షకు సంబంధించిన ప్రాథమిక కీ త్వరలోనే విడుదల కానుందని అధికారులు వెల్లడించారు. ఈ పరీక్షలు రాసిన అభ్యర్థులు తమ అధికారిక వెబ్సైట్ ద్వారా రెస్పాన్స్ షీట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చని తెలిపారు. అలాగే తప్పు ప్రశ్నలపై అభ్యంతరాలు తెలిపేందుకు త్వరలో ప్రత్యేక గడువును కూడా ప్రకటిస్తామని అధికారులు స్పష్టం చేశారు.