మొబైల్ వినియోగదారులకు తీపి కబురు: ప్రత్యేక వాయిస్ ప్లాన్లను తెచ్చిన Vi
రిపోర్టర్: కిరణ్
స్థలం: హైదరాబాద్
మొబైల్ వినియోగదారులకు ఇంటర్నెట్ డేటా అవసరం లేకుండా కేవలం కాల్స్, ఎస్ఎంఎస్ ల కోసం వొడాఫోన్ ఐడియా సంస్థ ప్రత్యేక వాయిస్ ఓన్లీ రీఛార్జ్ ప్లాన్లను అందుబాటులోకి తెచ్చినట్లు కంపెనీ వర్గాలు వెల్లడించాయి. ఈ కొత్త ప్లాన్లతో అదనపు ఖర్చు భారం తప్పుతుందని, సీనియర్ సిటిజన్లు అలాగే సాధారణ ఫోన్ వినియోగదారులకు ఇవి ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని అధికారులు స్పష్టం చేశారు.