నిరాశ్రయుల ఆకలి తీర్చేందుకు విశాఖలో కమ్యూనిటీ ఫ్రిజ్ల ఏర్పాటు

రిపోర్టర్: గోపి స్థలం: విశాఖపట్నం

విశాఖపట్నం నగరంలో నిరాశ్రయులు మరియు పేదల ఆకలి తీర్చేందుకు వైజాగ్ సిటీ పోలీస్ ఆధ్వర్యంలో కమ్యూనిటీ ఫ్రిజ్ల సేవలను అందుబాటులోకి తెచ్చినట్లు అధికారులు వెల్లడించారు. సీపీ డాక్టర్ శంఖబ్రత బాగ్చి ఆదేశాల మేరకు ఐదు కమ్యూనిటీ ఫ్రిజ్లను ఏర్పాటు చేసి ఆహారాన్ని అందిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని పోలీసులు కోరారు.