ఈసీ నిర్ణయంపై రాహుల్ గాంధీ ధ్వజం: బీజేపీకి తొత్తుగా మారారని ఫైర్
రిపోర్టర్: సతీష్
స్థలం: ఢిల్లీ
ఓటర్ల జాబితాలో భారీ అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం తీరుపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. నవంబర్ ఒకటో తేదీన ఢిల్లీలోని చారిత్రాత్మక రామ్ లీలా మైదాన్ వేదికగా ప్రతిపక్షాల ఇండియా కూటమి ఆధ్వర్యంలో భారీ శక్తి ప్రదర్శనకు సన్నాహాలు జరుగుతున్నట్లు ఆయన వెల్లడించారు. మింటో రోడ్ నుంచి రామ్ లీలా మైదాన్ వరకు సాగే ఈ భారీ పాదయాత్రలో మోదీ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడతామని కాంగ్రెస్ నేతలు స్పష్టం చేశారు.