పూణెలో గణేశునికి అపూర్వ కానుకగా భారీ మోదక్ కేక్

రిపోర్టర్: శ్రీనివాస్ స్థలం: Pune

మహారాష్ట్రలోని పూణెలో ప్రసిద్ధ శ్రీమంత్ డుషేత్ హల్వాయ్ గణపతికి గణేష్ ఉత్సవాల సందర్భంగా 251 కిలోల భారీ మోదక్ ఆకారపు కేక్‌ను సమర్పించారు. డబ్ల్యూఎస్ బేకర్స్ సంస్థకు చెందిన 40 నుంచి 50 మంది సిబ్బంది ఈ రస్‌మలై ఫ్లేవర్ కేక్‌ను తయారు చేశారు. ప్రేమ్ మందిర్ థీమ్‌తో ఏర్పాటు చేసిన పండల్‌లో ఈ కేక్‌ను భక్తుల సందర్శనార్థం ఉంచగా, పూజా కార్యక్రమాల అనంతరం దీనిని ప్రసాదంగా పంపిణీ చేశారు.