పెళ్లి పేరుతో మోసం: ఎస్బీఐ మేనేజర్ ఎఫ్ఐఆర్ కొట్టివేతకు కోర్టు నిరాకరణ

రిపోర్టర్: రమేష్ స్థలం: Madhya Pradesh

పెళ్లి పేరుతో తోటి మహిళా ఉద్యోగితో శారీరక సంబంధం పెట్టుకున్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మేనేజర్ పై నమోదైన ఎఫ్ఐఆర్ ను కొట్టివేయడానికి మధ్యప్రదేశ్ హైకోర్టు నిరాకరించింది. పెళ్లి వాగ్దానంపై సమ్మతి పొందడం విచారణలో తేలాల్సిన అంశమని జస్టిస్ హిమాన్షు జోషి స్పష్టం చేసినట్లు న్యాయవాదులు తెలిపారు. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పిటిషన్ను కొట్టివేశామని, తదుపరి విచారణ కొనసాగుతుందని న్యాయస్థానం స్పష్టం చేసినట్లు వెల్లడించారు.