పదిహేనేళ్ల నిరీక్షణ తర్వాత ఆసియా క్రీడలకు షాట్ పుటర్ కృష్ణ జయశంకర్ ఎంపిక

రిపోర్టర్: రమేష్ స్థలం: New Delhi

పదిహేనేళ్ల సుదీర్ఘ నిరీక్షణ మరియు అనేక ఇబ్బందులను ఎదుర్కొని ఆసియా క్రీడలకు ఎంపిక కావడంపై భారత షాట్ పుటర్ కృష్ణ జయశంకర్ హర్షం వ్యక్తం చేశారు. జపాన్ వేదికగా జరగనున్న ఆసియా క్రీడల్లో తొలిసారిగా భారత జెర్సీ ధరించి బరిలోకి దిగడం చాలా గర్వకారణంగా ఉందని ఆమె తెలిపారు. గాయాలు, వైఫల్యాలను తట్టుకుని జాతీయ ఛాంపియన్గా నిలవడం తన పట్టుదలకు నిదర్శనమని కృష్ణ పేర్కొన్నారు.