వైకాపాకు షాక్.. తెదేపాలోకి భారీగా చేరికలు!

రిపోర్టర్: విజయ్ స్థలం: విజయనగరం

గుర్ల మండలంలో వైకాపాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ముద్దాడపేట, పల్లపేట గ్రామాలకు చెందిన సుమారు 60 కుటుంబాలు వైకాపాను వీడి తెదేపాలో చేరాయి. చీపురుపల్లి ఎమ్మెల్యే కిమిడి కళా వెంకట్రావు వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. కూటమి ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులయ్యే తాము పార్టీలో చేరినట్లు వారు స్పష్టం చేశారు. గ్రామస్థాయిలో తెదేపాను బలోపేతం చేయాలని కళా వెంకట్రావు పిలుపునిచ్చారు.