పులివెందులలో తీవ్ర ఉద్రిక్తత: పోలింగ్ కేంద్రాల వద్ద వైసీపీ, టీడీపీ ఏజెంట్ల ఘర్షణ
రిపోర్టర్: ప్రవీణ్
స్థలం: Kadapa
రాష్ట్రంలో కొనసాగుతున్న ఎన్నికల పోలింగ్ సమయంలో కడప మరియు పులివెందుల కేంద్రాలలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయని పోలీసులు తెలిపారు. పోలింగ్ కేంద్రాలలోకి తమను రానివ్వకుండా టీడీపీ ఏజెంట్లు అడ్డుకుంటున్నారని వైసీపీ ఏజెంట్లు తీవ్ర ఆందోళనకు దిగారు. తమ ఫోన్లు పగలగొట్టి చొక్కాలు చించివేశారని వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన బలగాలు ఇరు వర్గాలను అదుపు చేసి, ఎలాంటి ఘర్షణలకు తావులేకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ప్రస్తుతం పోలింగ్‌ను ప్రశాంతంగా కొనసాగిస్తున్నాయి.