'జనవరిలోనే జేఈఈ మెయిన్-2027 పరీక్షలు': ఎన్‌టీఏ ప్రకటన

రిపోర్టర్: కృష్ణ స్థలం: India

నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ జాతీయ స్థాయిలో నిర్వహించే జేఈఈ మెయిన్-2027 సెషన్-1 పరీక్ష తేదీలను అధికారికంగా విడుదల చేసింది. జనవరి 22 నుంచి 30 వరకు మొత్తం 6 రోజుల పాటు ఈ పరీక్షలు జరగనున్నట్లు ఎన్‌టీఏ వెల్లడించింది. అక్టోబర్‌లో ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం కానుండగా, అభ్యర్థులు ఈ షెడ్యూల్ ప్రకారం ప్రిపరేషన్ సాగించాలని సూచించారు.