అంతర్జాతీయ డ్రగ్స్ ముఠాలపై ఉక్కుపాదం: ఆపరేషన్ ట్రైడెంట్ విజయంపై అమిత్ షా ప్రకటన
రిపోర్టర్: మహేష్
స్థలం: New Delhi
అంతర్జాతీయ మాదకద్రవ్యాల ముఠాలపై కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన ఆపరేషన్ ట్రైడెంట్ విజయవంతమైందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా వెల్లడించారు. అస్సాం, మిజోరం, మణిపూర్ రాష్ట్రాల్లో నిర్వహించిన ఈ సోదాల్లో సుమారు వంద కోట్ల రూపాయల హవాలా లావాదేవీలు వెలుగుచూశాయని ఆయన తెలిపారు. ఈ అండర్ కవర్ ఆపరేషన్లో పద్దెనిమిది మందిని అరెస్టు చేయడంతో పాటు వేయికి పైగా బ్యాంకు ఖాతాలను ఫ్రీజ్ చేసినట్లు అధికారులు స్పష్టం చేశారు.