రామలీలా మార్చ్కు తరలిరావాలని రాహుల్ గాంధీ పిలుపు: సీతక్క కీలక ప్రకటన

రిపోర్టర్: విజయ్ స్థలం: ములుగు

దేశ రాజధానిలో నవంబర్ మొదటి తేదీన జరగనున్న చలో ఢిల్లీ రామలీలా మార్చ్లో ప్రతి ఒక్కరూ భారీగా పాల్గొని విజయవంతం చేయాలని కోరుతూ లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఇచ్చిన పిలుపునకు మద్దతు తెలుపుతున్నట్లు దనసరి అనసూయ (సీతక్క) - మంత్రి, ములుగు ఎమ్మెల్యే వెల్లడించారు. ఇది ఏ ఒక్క రాజకీయ పార్టీకి సంబంధించిన కార్యక్రమం కాదని, రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి దేశ ప్రజలందరూ కలిసికట్టుగా సాగవలసిన చారిత్రాత్మక ప్రయాణమని ఆమె పేర్కొన్నారు.